తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగం లేదని కుంగిపోవద్దు.. ఎన్నో అవకాశాలున్నాయి' - Nagar Kurnool District Latest News

ఉచిత పోలీసు శిక్షణా కేంద్రాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నారు. శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

free police training center
ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

By

Published : Dec 19, 2020, 8:16 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణా కేంద్రాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. యువత దీక్ష, పట్టుదల, కృషితో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్నారు.

అభినందనీయం...

యువతతో మాట్లాడి వారితో షాట్ ఫుట్ ఆడారు. అందరికీ స్వయంగా భోజనాలు వడ్డించారు. గతంలోనూ వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకులు శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం పోలీసు, ఉపాధ్యాయ ఇతర ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి.

-మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే

ఉద్యోగం రాకపోతే యువత నిరుత్సాహపడరాదని అన్నారు. ప్రైవేటు, వ్యాపార రంగాల్లో ఎన్నో అవకాశాలున్నాయని సూచించారు. అనంతరం తెలకపల్లి మండలం కేంద్రంలో జడ్పీ చైర్​పర్సన్ పద్మావతితో కలిసి.. లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు.

ఇదీ చూడండి : టీఎన్జీవో పూర్తిగా విఫలమైంది: ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details