తెలంగాణ

telangana

ETV Bharat / state

'కళాశాల భూమి వివాదంలో ఉంటే ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు' - nagar kurnool district news

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల భూమి విషయంలో రాద్ధాంతం జరుగుతుంటే ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి ప్రశ్నించారు. కళాశాలకు కేటాయించిన స్థలం ఎంతో తక్షణమే సర్వే చేపట్టి పరిసర ప్రాంత రైతులకు నోటీసులు ఇచ్చి సరిహద్దులు ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్రమించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు.

marri janardhan reddy
marri janardhan reddy

By

Published : Sep 5, 2020, 2:15 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న వివాదాస్పద మహిళా డిగ్రీ కళాశాల భూమిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి, ఆర్​డీవో, ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. భూమికి సంబంధించిన మ్యాప్​ను తెప్పించి ఏఏ సర్వే నంబర్​లో ఎంత భూమి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కళాశాల భూమి విషయంలో రాద్ధాంతం జరుగుతుంటే ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. కళాశాల భవనానికి కేటాయించిన స్థలం ఎంతో తక్షణమే సర్వే చేపట్టి పరిసర ప్రాంత రైతులకు నోటీసులు ఇచ్చి హద్దులు ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్రమించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడే బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details