తెరాస ప్రభుత్వ పాలనలో.. పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లుతున్నాయని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా గగ్గలపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
'తెరాస పాలనలో.. పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లుతున్నాయి' - మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. గగ్గలపల్లి గ్రామాన్ని సందర్శించారు. వీధుల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో.. ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.

మర్రి జనార్దన్ రెడ్డి
గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కోసం తక్షణమే నివేదిక అందించాలని ఎమ్మెల్యే.. అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సేవలు చేసేందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి:కరోనా నిబంధనలు గాలికొదిలేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు