కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని తిమ్మారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
కొవిడ్ టీకా దేశానికే గర్వకారణం :మర్రి జనార్థన్‌రెడ్డి - ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి తాజా వార్తలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి ప్రారంభించారు. మెదటి దశలో వైద్య ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి మాత్రమే టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు.
టీకా అందుబాటులోకి రావడం దేశానికే గర్వకారణం:మర్రి జనార్థన్‌రెడ్డి
టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మాజీపేటలో కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో 30 మందికి చొప్పున వాక్సిన్ ఇచ్చారు. మెుదటి దశలో వైద్య ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నామని డాక్టర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,963 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాబోయే ఎన్నికల్లో తెరాస సత్తా చాటాలి : మంత్రి కేటీఆర్