నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బిజినాపల్లి మండలం పాలెం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు కింద పడి గాయాలపాలయ్యాడు. అప్పుడే అటుగా వెళ్తున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గమనించి వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి - nagarkarnool district latest news
తీవ్ర గాయాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. బిజినాపల్లి ఎస్సై వెంకట స్వామిని ఆస్పత్రిలో ఉండి బాధితుడిని చూసుకోవాలని ఆదేశించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
అతని వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. బిజినాపల్లి ఏఎస్సై వెంకటస్వామిని ఆస్పత్రిలో ఉండి బాధితుడిని చూసుకోవాలని ఆదేశించారు. కరోనా కాలంలో రోడ్డుపై ప్రమాదాలు జరిగితే సాయం చేయడానికి జంకుతున్న సమయంలో ఎమ్మెల్యే దగ్గరుండి సహాయం చేశారు.
ఇదీ చూడండి:-ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు
Last Updated : Aug 6, 2020, 6:11 PM IST