ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం వెనుక మానవీయ కోణం ఉంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజీపేట, తాడూరు మండలాలకు చెందిన 20 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు తేలేదన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని తెలిపారు.