కరోనా లాంటి విపత్కర కాలంలో కూడా రైతులను ఆదుకుంటున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. బిజనాపల్లి గ్రామంలో తెరాస ఆవిర్భావం సందర్భంగా జెండా ఎగురవేశారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి శ్రీకారం - ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తాజా వార్తలు
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. బిజనాపల్లి గ్రామంలో తెరాస ఆవిర్భావం సందర్భంగా జెండా ఎగురవేశారు. రైతులను ఆదుకుంటున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని అన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి భూమి పూజ
కరోనా కాలంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. అందరూ మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.