తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్​డ్యామ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - check dams

నాగర్​కర్నూలు జిల్లాలోని పాపగల్​ గ్రామ సమీపంలో దుందుభి నదిపై 6 కోట్ల 12 లక్షలతో నిర్మిస్తున్న చెక్​డ్యామ్​ నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ చెక్​డ్యామ్​ వల్ల 5వేల నుంచి 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.

MLA janardhan reddy  laid the foundation for the construction of a check dam in nagarkarnool district
చెక్​డ్యామ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 9, 2020, 5:25 PM IST

చెక్​డ్యామ్​లు నిర్మించడం వల్ల రైతులకు సాగునీరు అందడమే కాక.. ఈ ప్రాంత భూగర్భ జలాలు పెరుగుతాయని శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్​కర్నూలు నియోజకవర్గం తాడూరు మండలం పాపగల్ గ్రామ సమీపంలో కృష్ణా నది ఉపనది అయిన దుందుభి నదిపై 6 కోట్ల 12 లక్షలతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ చెక్ డ్యామ్ వల్ల 5 వేల నుంచి 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే అన్నారు. దుందుభి నదిపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, తాడూరు మండలంలో మొత్తం 8 చెక్ డ్యామ్​లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ చెక్ డ్యామ్ వల్ల పాపగల్ గ్రామంలో ఉన్న పొలాలకు సాగునీరు, చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించారు.

ఇవీ చూడండి: చనిపోయిన వారికి కరోనా పరీక్షలు అశాస్త్రీయం: ఈటల

ABOUT THE AUTHOR

...view details