తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - mla started development works at nagar kurnool

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ హరితహరంలో భాగంగా మొక్కలు నాటి, రైతు వేదిక భవనానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తోందని... ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రారంభించారని ఎమ్మెల్యే అన్నారు.

mla started development works at nagar kurnool
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

By

Published : Jul 1, 2020, 6:45 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే జైపల్​ యాదవ్​ మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతు వేదిక భవనానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

అనంతరం రైతు వేదిక భవనానికి ఉచితంగా భూమిని అందించిన భగవాన్​రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. ప్రతి గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని జైపాల్​ యాదవ్​ కోరారు. రైతు సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ ముందుందని... అన్ని ప్రాంతాల్లోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details