తెలంగాణ

telangana

ETV Bharat / state

దళారులను నమ్మి రైతన్నలు మోసపోవద్దు: ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే హర్షవర్ధన్​ రెడ్డి తెలిపారు. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ పట్టణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

mla harshvardhan opened corn purchasing center in nagar kurnool district
దళారులను నమ్మి రైతన్నలు మోసపోవద్దు: ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి

By

Published : Nov 5, 2020, 1:43 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో తెలంగాణ మార్క్ ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకుందని ఆయన తెలిపారు. కఠినకాలంలో కూడా సర్కారు ముందుకు వచ్చి పంటలు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని... ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్​: ఎమ్మార్వో

ABOUT THE AUTHOR

...view details