నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శివారులో ఈదమ్మ జాతర ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం నిర్వహించిన రథోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త లక్ష్మణరావు అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈదమ్మ తల్లి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
ఈదమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ - ఈదమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శివారులో ఈదమ్మ జాతర వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈదమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్