రంజాన్ పండుగను పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి హాజరై.. సుమారు వెయ్యి మంది నిరుపేద ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో మైనార్టీలకు తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం సోదరుల పిల్లలకు ఉన్నత చదువులు, గురుకుల పాఠశాలతో పాటు విదేశీ చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న దృష్ట్యా ముస్లింలు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని సూచించారు.