నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జొన్నలబోగడ జలాశయం నుంచి కాలువలకు సాగునీటిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.రైతును రాజును చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే అన్నారు.
సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ - water relase to canals at nagarkurnool
నాగర్‌కర్నూలు జిల్లాలోని జొన్నలబోగడ జలాశయం నుంచి సాగునీటిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కాలువలకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 వద్ద సాంకేతిక లోపంతో మోటర్లు నీట మునిగాయని.. వాటి మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ముందున్నామని తెలిపారు. అనంతరం పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇదీ చదవండిఃధరణితో 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి: యాదాద్రి కలెక్టర్