మహాశివరాత్రిని పురస్కరించుకుని.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల శివనామస్మరణతో.. సోమేశ్వరాలయం మారుమోగిపోయింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
సోమశిల సన్నిధిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ - ద్వాదశ జ్యోతిర్లింగాలు
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ప్రముఖ శైవ క్షేత్రం సోమశిలలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ.. భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
సోమశిల సన్నిధిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్
ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ.. భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఈ వేడుకల్లో.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:మహా శివరాత్రి పర్వదినాన ఆరడుగుల శ్వేత నాగు ప్రత్యక్షం