నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 300 మంది ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలని తెలిపారు.
మైనార్టీలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే - distribute Essential goods for Muslims in Kollapur
రంజాన్ పండుగ సందర్భంగా కొల్లాపూర్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
మైనార్టీలకు అండగా ఉంటాం
పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. తెరాస ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉందని వెల్లడించారు. ముస్లింలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Last Updated : May 20, 2020, 11:38 AM IST