చివరి ఆయకట్టు వరకు నీరివ్వటమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ అతిథి గృహంలో కేఎల్ఐ సాధన సమితి సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన కాలువలు, ప్రాజెక్టు నిర్మాణాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు.
'చివరి ఆయకట్టు వరకు నీరివ్వటమే లక్ష్యం' - projects in telangana
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కేఎల్ఐ సాధన సమితి సభ్యులతో ఎంపీ పోతుగంతి రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
mla and mp participated in meeting in kalvakurthi
ఈ ప్రాంత రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలన్న నిర్ణయంతో విడతల వారిగా... 29- ప్యాకేజీ, డీ-82 కాల్వల కోసం రూ. 150 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, జలసాధన సమితి సభ్యులు లక్ష్మణ శర్మ తదితరులు పాల్గొన్నారు.