నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రజలకు ఎంజేఆర్ ట్రస్ ఏర్పాటు చేసిన కషాయ పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం అని అందుకే ఈ ఉచిత కషాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కషాయం పంపిణీ - ఎంజేఆర్ ట్రస్టు సందర్భంగా కషాయం వితరణ కేంద్రం
కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎంజేఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉచిత కషాయం పంపిణీ కార్యక్రమాన్ని ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు ఎమ్మెల్యే సతీమణి మర్రి జమునా రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
![ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కషాయం పంపిణీ mjr trust Infusion Distribution Center opened by mla marri janardhan reddy in nagarkurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8304001-721-8304001-1596623843870.jpg)
ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కషాయం పంపిణీ
దీన్ని ప్రజలు అందరూ సద్వినియోగించుకోవాలన్నారు. నియోజక వర్గంలో కొవిడ్ బారినపడిన బాధితుల కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా రూ. 2000 విలువగల ఐసొలేషన్ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఎంజేఆర్ వాలంటీర్లు నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వాటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!