నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదర్శనగర్‌లో కొద్దిరోజుల క్రితమే తీసుకొచ్చిన మిషన్ భగీరథ పైపులు మధ్యాహ్నం అనుకోకుండా చెలరేగిన మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన మంటలను చూసి.. భయభ్రాంతులకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మిషన్ భగీరథ పైపులు అగ్నికి ఆహుతి - Mission Bhagiratha pipes burned at achampet
అనుకోకుండా చెలరేగిన మంటల్లో మిషన్ భగీరథ పైపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 9లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన నాగర్‌కర్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

మిషన్‌భగీరథ పైపులు అగ్నికి ఆహుతి
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో 2.5 కిలోమీటర్ల పొడవు పైపు కాలిపోయిందని, సుమారు 9లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మిషన్ భగీరథ సహయక ఇంజనీర్ షబ్బీర్ తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
- ఇదీ చదవండి :పొద్దునేమో భానుడి భగభగ... రాత్రిపూట ఉక్కపోత