నాగర్ కర్నూలు జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి కొన్ని గంటల పాటు నీళ్లు వృథాగా పోయిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామ సమీపంలో గల ఎస్వీఎస్ కంటి ఆసుపత్రి వద్ద పైపులైన్ లీకేజీతో నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ నీటితో చుట్టూ పక్కల పరిసరాలు చిన్న కుంటను తలపించేలా కనిపించాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న ఈ నీటిని చూసి ప్రజలు ఏమి చేయాలో అర్థంకాక సతమతమయ్యారు. ఇలా చాలా సేపు వృథాగా పోయిన తర్వాత అధికారులు ఈ నీటి లీకేజీ గుర్తించి మరమ్మతు చేశారు.
పైపులైన్ పగిలి ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు - pipeline
మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుడుకుర్తి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
పైపులైన్ పగిలి ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు