ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలి వృథాగా మంచినీరు పోవడంతో చెరువును తలపించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటుచేసుకుంది. పూలే విగ్రహం సమీపంలో కేబుల్ వర్కర్లు భూగర్భ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
కేబుల్ వర్కర్ల నిర్లక్ష్యం.. మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృథా - telangana news
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలి మంచి నీరు వృథాగా పోయింది. దీంతో రహదారి చెరువును తలపించేలా మారిపోయింది. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృథా
కేబుల్ పనులు చేసేటప్పుడు మున్సిపాలిటీ సిబ్బందిని వెంట పెట్టుకొని వారి సలహాల మేరకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేయడంతోనే పైపు పగలిందని మిషన్ భగీరథ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు కేబుల్ వర్క్ వాహనాన్ని పీఎస్కు తరలించారు.