తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు-రంగారెడ్డి: డిజైన్​ మేరకే పనులు జరుగుతున్నాయా..? - నార్లపూర్​ జలాశయం పనులను పరిశీలించిన మంత్రులు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై ఉమ్మడి జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ దృష్టిసారించారు. ఇవాళ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.

palamuru rangareddy lift irregation
పాలమూరు-రంగారెడ్డి: డిజైన్​ మేరకే పనులు జరుగుతున్నాయా..?

By

Published : Jul 31, 2020, 5:31 PM IST

పాలమూరు-రంగారెడ్డి: డిజైన్​ మేరకే పనులు జరుగుతున్నాయా..?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లపూర్‌ వద్ద అంజనగిరి జలాశయం నిర్మాణ పనులను పరిశీలించారు.

అంజనగిరి జలాశయం..

మొదట పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని మ్యాప్​ల ద్వారా పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్యాకేజీల వారిగా జరిగిన పనులను వివరించారు. అక్కడి నుంచి అంజనగిరి జలాశయం పంప్‌ హౌజ్​ నిర్మాణ పనులను పరిశీలించారు.

నార్లపూర్‌ జలాశయం..

అనంతరం నార్లపూర్‌ జలాశయం కట్టపైకి చేరుకున్న మంత్రులు.. పనుల పురోగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై ఆరాతీశారు. నార్లపూర్‌ జలాశయంలో ఆగిపోయిన కట్ట నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాతి కట్టడం నిర్మాణం మేలా.. మట్టి కట్ట నిర్మాణం చేపట్టాలా అనే అంశంపై మంత్రులిద్దరూ అధికారులతో చర్చించారు. కట్ట ఎత్తు పెంచితే జలాశయం సామర్థ్యం ఎంత ఉంటుంది.. తగ్గిస్తే ఎలా ఉంటుంది అనే అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు నిర్ణయించిన డిజైన్‌ మేరకే పనులు కొనసాగుతున్నాయా..? లేదా.. అని అధికారుల నుంచి వివరాలు సేకరించారు. నార్లాపూర్‌ జలాశయం నుంచి... వనపర్తి జిల్లా ఏదుల జలాశయానికి చేరుకున్న మంత్రులు అక్కడ కూడా పంప్‌హౌజ్​ నిర్మాణం, కట్ట పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఇవీచూడండి:పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details