నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు - రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కల్వకుర్తి పట్టణంలోని ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు పరామర్శించారు, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు
ఎమ్మెల్యేగా ఉండే రోజుల్లో కిష్టారెడ్డి అన్ని వర్గాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కలుపుకొని పోయేవారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన లేని లోటు ఎంతగానో ఉంటుందని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లక్షన్నర చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని