నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భూమి పూజ నిర్వహించారు. కొనేటిపురం గ్రామంలో రంగసముద్రం చెరువులో చేపపిల్లలను వదిలారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి - అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భూమి పూజ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
![అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5124248-899-5124248-1574252197504.jpg)
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, వంటి సంక్షేమ పథకాలను అందించడంలో ముందుందని మంత్రి తలసాని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. జేఎసీ నాయకులు మంత్రిని కలిసి గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి ఇతర మంత్రులు స్పందించడం లేదని అడగగా మంత్రి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఇదీ చూడండి : గాయత్రి పంప్‌హౌస్ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు