తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ప్రాజెక్టులోని చిన్న లోపం వల్లనే శ్రీశైలం తిరుగు జలాల ఒత్తిడి వల్ల పంప్​హౌస్​లోకి నీరు చేరాయన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

minister srinivas goud visit kalwakurthy lift irrigation
ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Oct 17, 2020, 10:38 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్​హౌస్ మూడో పంపు వద్ద శ్రీశైలం తిరుగు జలాల ఒత్తిడి వల్ల నీరు చేరిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మంత్రి పంప్​హౌస్​ను పరిశీలించారు. ప్రాజెక్టులో చిన్న లోపం వల్లనే శ్రీశైలం తిరుగు జలాలు పంపు హౌసులోకి వచ్చాయన్నారు. ప్రతిపక్ష నాయకులు పని కట్టుకొని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిన్నచిన్న లోపాలు జరుగుతుంటాయని దానిని వెంటనే సరి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి అన్నారు. తాగు, సాగునీటి కోసం రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పంప్​హౌస్​లోకి చేరిన నీటిని తోడి, తక్షణమే మరమ్మతులు చేసి మోటార్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని... అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రాజెక్టులపై ఎంతో అవగాహన ఉందని... ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details