తెలంగాణ

telangana

ETV Bharat / state

'పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం'

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద సోమశిల ఎకో టూరిజంను పర్యటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.

సోమశిల ఎకో టూరిజం

By

Published : Nov 22, 2019, 5:22 AM IST

రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని పర్యటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద సోమశిల ఎకో టూరిజంను ఆయన సందర్శించారు. సోమశిల ప్రాంతాన్ని సందర్శించే పర్యటకుల సౌకర్యార్థం తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలు, బోటు సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్, రామోజీ ఫిలింసిటీ ఎలా గుర్తుకు వస్తాయో.. సోమశిల పేరుచెప్తే.. ఇక్కడి ప్రకృతి రమణీయత మైమరిపిస్తుందని మంత్రి తెలిపారు. సోమశిలలాగే రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామంటోన్న పర్యటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో ఈటీవీ ముఖాముఖి..

సోమశిల ఎకో టూరిజంపై మంత్రి శ్రీనివాస్​గౌడ్

ABOUT THE AUTHOR

...view details