వర్షాలు ఆశాజనకంగా ఉండడం వల్ల అనుకున్నదాని కంటే ముందు రైతులకు సాగునీరు వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ వద్ద నీటి విడుదల చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 29,30 ప్యాకేజీల నుంచి నీటిని విడుదల చేశామని... ఈ ఏడు వానకాలం, యాసంగికి సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు. రైతులు నీళ్ల కోసం ఇష్టం ఉన్న చోట్ల కాలువలకు ఎక్కడపడితే అక్కడ గండ్లు కొట్టొద్దని... అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.