కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎంపీ రాములు, కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను పరామర్శించారు. బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపారు. రోగులకు ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కరోనా చికిత్సకు ఆలస్యం చేస్తేనే సమస్యలు: నిరంజన్ రెడ్డి
కరోనా నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిని మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను పరామర్శించారు. బాధితులు మనోనిబ్బరంగా ఉండాలని సూచించారు. బ్లాక్ ఫంగస్‌తో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
కరోనా నివారణలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స పొందిన ప్రతి ఒక్కరూ కోలుకున్నారని.. ఆలస్యం చేసిన వారికి మాత్రమే సమస్యలు తలెత్తాయని నిరంజన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన వెల్లడించారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వ్యాధిగ్రస్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించారని మంత్రి చెప్పారు. బ్లాక్ ఫంగస్‌తో అప్రమత్తంగా ఉండాలని దీనికి మందులు కేంద్రమే సరఫరా చేస్తుందని అన్నారు. ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని దీని కోసం కమిటీ వేసినట్లు వెల్లడంచారు.
ఇదీ చదవండి:లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ