నారాయణపేట జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రాథమిక సహకార సంఘం వాణిజ్య సముదాయం, మోడల్ మార్కెట్ నిర్మాణానికి, అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులకు పూజలు నిర్వహించారు.
రైతులకు మంచి రోజులు వచ్చాయి: మంత్రి నిరంజన్ రెడ్డి - అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపనలు
వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి రైతులకు మంచి రోజులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణ పేట జిల్లా పర్యటించిన మంత్రి... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
రైతులకు మంచి రోజులు వచ్చాయి: మంత్రి నిరంజన్ రెడ్డి
రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి సమృద్ధిగా చేసుకునే స్థాయికి రైతులు ఎదిగారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ వనజ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:1100ఏళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం