రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి పంటలను పండించి... రైతులు రాజులుగా మారాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, అచ్చంపేట మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, నిరుపేద మహిళలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ శర్మన్‌తో కలిసి ఉచిత భూ పంపిణీ పట్టాలు అందజేశారు.
'ఉచితంగా భూమి పంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే'
ఎస్సీ, ఎస్టీ, నిరుపేద మహిళలకు ఉచిత భూమి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేలాది మంది లబ్ధిదారులకు భూమి పంపిణీ చేయినట్లు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, అచ్చంపేట మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, నిరుపేద మహిళలకు ఉచిత భూ పంపిణీ పట్టాలను అందజేశారు.
niranjan reddy
తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేలాది మంది పేదలకు ఉచిత భూమిని ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయపరంగా అభివృద్ధి చెందదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని వివరించారు. పట్టాలు పొందిన రైతులను మంత్రి శాలువాలతో సన్మానించారు.