అంగరంగ వైభవంగా పసుపుకొట్టే కార్యక్రమం - mass marriage
వివాహాలకు శుభసూచకంగా జరుపుకునే పసుపు కొట్టే కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అంగరంగ వైభవంగా పసుపుకొట్టే కార్యక్రమం
డిసెంబర్ 1న జరగబోయే సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా నేడు పసుపు కొట్టే కార్యక్రమాన్ని నాగర్కర్నూల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిపారు. ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి మర్రి జమున... వేదపండితుల మధ్య శాస్త్రయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.