తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీతో తీవ్ర ఇబ్బందులు: మల్లు రవి - పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీతో తీవ్ర ఇబ్బందులు: మల్లు రవి

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్​ నేత మల్లు రవి అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు.

కాంగ్రెస్​ శ్రేణులతో మల్లు రవి

By

Published : Nov 9, 2019, 4:57 PM IST

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త జిల్లాల కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​ను మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ముట్టడించారు. పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ హయాంలో 8 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 3.5 శాతం పడిపోయిందని తెలిపారు. తహసీల్దార్​ విజయ రెడ్డి హత్యకు కారకులైన వారు ఎంతటి వారినైనా శిక్షించి తీరాలని డిమాండ్ చేశారు.

పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీతో తీవ్ర ఇబ్బందులు: మల్లు రవి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details