నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో జాతిపిత మహాత్మా గాంధీ 151 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్ రెడ్డి జిల్లా శాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో గాంధీ జయంతి వేడుకలు - nagar kurnool collectorate latest news about gandhi jayanthi
గాంధీ జయంతి వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. జిల్లా అదనపు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్ రెడ్డి జిల్లా శాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో గాంధీ జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సాధనలో బాపూ కృషిని వారు స్మరించుకున్నారు. ఆయన త్యాగ ఫలితాన్ని ఈ రోజు మనం పొందుతున్నామని పేర్కొన్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.