నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల సమీపంలో ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో 11 మంది తీవ్రగాయాలపాలయ్యారు. తిమ్మాజీపేట మండల సమీపంలోని తువ్వబండ తండా వద్ద రోడ్డుపై గొర్రెలు వస్తుండడం వల్ల లారీ ఆపగా.. వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటో లారీని ఢీకొట్టింది.
లారీని ఢీకొట్టిన ఆటో.. 11 మందికి తీవ్రగాయాలు - road accident in nagarkurnool
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట సమీపంలో ఆగిన ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

లారీని ఢీకొట్టిన ఆటో
ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చింతగట్టు తండాలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
నాగర్కర్నూల్ జిల్లాలో లారీని ఢీకొట్టిన ఆటో
ఇవీ చూడండి:ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన హైకోర్టు