పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వహించేందుకు నాగర్కర్నూల్ జిల్లా అధికారగణం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ 8 లక్షల 48 వేల 912 బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సూపర్ వైజర్లు, సహాయకులు కలిపి 1,624 మంది విధుల్లో ఉంటారు. జిల్లాలో పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 2,224 మంది ఎన్నికల కౌంటింగ్లో సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాల, పాలెంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, కల్వకుర్తి నియోజకవర్గంలోని సీబీఎం జూనియర్ కళాశాల, అచ్చంపేట నియోజకవర్గంలోని జీఎస్ఎం జూనియర్ కళాశాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నాగర్కర్నూల్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలకు, 209 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలకు, 212 ఎంపీటీసీ స్థానాలలో రెండు ఏకగ్రీవం కాగా... ఒక ఎంపీటీసీ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 209 స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: 'తెలంగాణలో తెదేపా వందశాతం ఉంటుంది'