నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తెరాస సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహం, చాకలి ఐలమ్మ, మహేంద్రనాథ్ విగ్రహాలకు నివాళులర్పించిన కేటీఆర్... తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే అంబేడ్కర్ విజ్ఞాన భవనానికి, అచ్చంపేటలోని రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం: కేటీఆర్ - minister ktr in achampet
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే అంబేడ్కర్ విజ్ఞాన భవనానికి, అచ్చంపేటలోని అచ్చంపేటలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అచ్చంపేటలో రోడ్డు విస్తరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన
మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై భారీ వంతెన నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ అచ్చంపేట తెరాస సభలో హామీనిచ్చారు. ఉమామహేశ్వరం, చెన్నకేశవ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: సోనూ సాయం.. విద్యార్థుల కోసం సెల్ టవర్ ఏర్పాటు
Last Updated : Apr 14, 2021, 7:55 PM IST