Krmb Inspection: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కృష్టానది యాజమాన్య బృందం పరిశీలించింది. ప్రాజెక్టు అధికారులతో పీఎల్‌ఆర్‌ఐ పనులపై కేఆర్ఎంబీ అధికారులు ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 1, 2, 3, 4 పనులను కృష్ణా యాజమాన్య బోర్డు అధికారులు పరిశీలించారు. ఎల్లూరు సమీపంలోని ప్యాకేజీ-1లో సొరంగం, సున్నపు తండా దగ్గర ప్యాకేజీ-2 రిజర్వాయర్ కట్ట, ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, మెయిన్ కెనాల్ పనులను కృష్ణా యాజమాన్య బోర్డు అధికారులు ప్రకాశ్, సత్యనారాయణరెడ్డి.. ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు.
Krmb Inspection: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై కేఆర్‌ఎంబీ పరిశీలన - Palamuru Rangareddy lift irrigation news
Krmb Inspection: నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కేఆర్‌ఎంబీ అధికారులు పరిశీలించారు. ఎల్లూర్ సమీపంలో ప్రాజెక్టు ప్యాకేజీ పనులపై ఆరా తీశారు.
Krmb
కృష్ణాబోర్డు అధికారులకు ప్రాజెక్టు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనులు, నీటి విడుదల వివరాలు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశానుసారం కృష్ణాబోర్డు, సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడం వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.
ఇదీ చూడండి:అనుమతుల్లేకుండా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖలు