పేదల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలోని కోడూరు, వీపనగండ్ల, మండలాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు.. భూమి పూజ చేశారు. అనంతరం అర్హులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
'ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇంకెక్కడా లేవు' - mla biram harsha varadhan update
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. నిరుపేదలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇంకెక్కడా లేవు'
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో రైతు భవనాలను నిర్మించి.. సీఎం కేసీఆర్ అన్నదాతల పాలిట దేవుడిలా నిలిచారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
ఇదీ చదవండి:'సీఎం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు'