తెలంగాణ ఆడబిడ్డలు సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడెర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని సంకల్పించారని.. అందుకే ఇలా ప్రతి యేటా చీరలను కానుకగా ఇస్తున్నారని చెప్పారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి - బతుకమ్మ చీరల పంపిణీ
తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తోందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు మండలాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
బతుకమ్మ చీరల వల్ల చేనేత కార్మికుల బతుకులు బాగు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లతో కూడిన చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. తెలంగాణ ఆడపడుచులు అంతా సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి సబిత