నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు వద్ద నిర్మించిన కేఎల్ఐ పంపు హౌస్‌ను కృష్ణా బోర్డు అధికారులు సందర్శించారు. అక్టోబర్ 16న నీటమునిగిన ఎల్లూరు పంప్‌హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంప్ హౌస్‌లోకి నీరు చేరడం, మునిగి పోవడం తదితర వాటిని గమనించారు. ఎత్తిపోతల సలహాదారుడు పెంటారెడ్డి, కేఎల్ఐసీ.అంజయ్య పంప్ హౌస్ మునిగిపోయిన విషయాలు, సాంకేతిక సమస్యలను వారికి వివరించారు.
పంపు హౌస్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించిన అధికారులు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన కేఎల్ఐ పంపు హౌస్ ప్రాజెక్టును కృష్ణా యజమాన్య బోర్డు అధికారులు, సీడబ్ల్యూసీ ఇంజినీరింగ్ సిబ్బంది సందర్శించారు.
పంపు హౌస్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించిన అధికారులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని అప్రోచ్ ఛానల్, సొరంగం పనులను వారు పరిశీలించారు. బృందంలో కృష్ణ యజమాన్య బోర్డు సీఈఎంకీ శ్రీనివాస్, సభ్యులు మౌతంగ్, రాయి పూరె, సీడబ్ల్యూసీ డైరెక్టర్ దర్పన్ తల్వార్, ప్రాజెక్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత