తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఎల్​ఐ పథకం రెండో పంపుహౌస్​ పునరుద్ధరణ పూర్తి - kli project motor restoration started

కేఎల్​ఐ పథకంలో ప్రమాదానికి గురైన ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. అక్టోబర్​ 16న మూడో మోటారు ప్రమాదానికి గురైంది. దానికి మరమ్మతులు చేపట్టి నవంబరు 21న ప్రారంభించారు. మరో పదిరోజులు మరమ్మతులు చేపట్టి రెండో పంపుని గురువారం ప్రారంభించారు.

kli project second pump house restoration completed
కేఎల్​ఐ పథకం రెండో పంపు హౌస్​ పునరుద్ధరణ పూర్తి

By

Published : Dec 3, 2020, 4:50 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదానికి గురైన ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. గురువారం ఉదయం 11 గంటలకు శ్రీశైలం జలాశయం మిగులు జలాల నుంచి రెండో పంపు ద్వారా నీటి ఎత్తిపోతను అధికారులు పునరుద్ధరించారు.

కేఎల్​ఐ పథకంలో మొదటి పంపు హౌస్ అయిన ఏల్లూరు లిఫ్ట్​లో అక్టోబర్ 16న పెద్ద శబ్దంతో మూడో మోటారు ప్రమాదానికి గురైంది. దీంతో పంప్ హౌస్ నిండా నీరు చేరి నీటి ఎత్తిపోత ఆగిపోయింది. సుమారు నెల రోజుల పాటు శ్రమించిన అధికారులు నిండిన నీటిని ఎత్తిపోయడంతో పాటు మోటార్లకు మరమ్మతులు చేశారు. నవంబర్ 21న మొదటి పంపును ప్రారంభించారు. మరో పది రోజుల పాటు మరమ్మతులు చేపట్టి రెండో పంపుని ప్రారంభించారు.

ప్రస్తుతం ఒక్కో మోటార్​కు 800 క్యూసెక్కుల చొప్పున 1,600 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు రిజర్వాయర్​ను నింపడానికి ఎత్తిపోస్తున్నారు. ఎల్లూరు జలాశయం నుంచే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సుమారు 1,550 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు విడుదల చేయాల్సి ఉంది. యాసంగి పంటలకు సైతం ఇదే పంప్ హౌస్ నుంచి నీరు విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి:పులి కోసం 'అన్వేషణ'... ఎవరూ అడవులకు వెళ్లొద్దు

ABOUT THE AUTHOR

...view details