కేఎల్ఐ ఎల్లూరు పంప్ హౌస్‌లో మోటార్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒకటో మోటార్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహిస్తూ మోటార్లను విద్యుత్‌తో వేడి చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కేఎల్ఐ ప్రాజెక్టులో ఒకటో మోటార్‌ను ఈనెల 20న ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక అందించారు. శుక్రవారం నాటికి గడువు ముగుస్తుండటంతో మోటార్ల మరమ్మతుల్లో వేగం పెంచారు.
శనివారం ఉదయం కేఎల్ఐ ఒకటవ మోటారు ట్రయల్ రన్ - కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్ల పునరుద్ధరణ పనులు
కేఎల్ఐ ఎల్లూర్ పంప్‌హౌస్‌లో మోటార్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు వద్ద కేఎల్ఐ ప్రాజెక్టులోని ఒకటో మోటారుని ఈ నెల 20న ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక అందించారు. గడువు ముగుస్తుండటంతో మోటార్ల మరమ్మతులు వేగవంతం చేశారు. ఈ రోజు సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
శనివారం ఉదయం కేఎల్ఐ ఒకటవ మోటారు ట్రయల్ రన్
పనుల పురోగతిపై అధికారులను వివరణ కోరగా ఒకటో మోటార్ ట్రయల్‌కు ఇంకా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. మిగతా మోటార్లకు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు.