తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి కేసీఆర్ మహా భగీరథుడు - klky

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మహాభగీరథుడని కొనియాడారు తెరాస రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి రాములు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

కేసీఆర్ మహా భగీరథుడు

By

Published : May 9, 2019, 11:18 PM IST

రాష్ట్రంలో 30 ఏళ్లుగా లేని ప్రగతి తెరాస పాలనలో కనిపిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి రాములు అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ గృహంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మహా భగీరథుడని ఆయన ప్రశసించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీరు.. మిషన్​ కాకతీయ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు.

కేసీఆర్ మహా భగీరథుడు

ABOUT THE AUTHOR

...view details