తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయాల్లో కార్తిక శోభ... పరమ శివునికి ప్రత్యేక పూజలు - కార్తిక మాసం ప్రత్యేకత

కార్తిక పౌర్ణమి... కార్తిక సోమవారం కలిసిరావడంతో భక్తులు వేకువ జామునుంచే ఆలయాలకు బారులు తీరారు. కుటుంబ సమేతంగా పూజలు చేసి కార్తిక దీపాలను వెలిగించారు. నాగర్​ కర్నూల్​లోని వివిధ దేవాలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి.

karthika pournami special pooja in nagarkurnool district temples
ఆలయాల్లో కార్తిక శోభ... పరమ శివునికి ప్రత్యేక పూజలు

By

Published : Nov 30, 2020, 1:28 PM IST

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నాగర్​ కర్నూల్ జిల్లాలోని ఆలయాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. మహిళలు తులసి పూజలతో పాటు దీపారాధనలు చేసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయాల్లో కార్తిక శోభ... పరమ శివునికి ప్రత్యేక పూజలు

శ్రీశైలం మల్లన్న ఉత్తర ద్వార దర్శనం, నల్లమల అభయారణ్యంలో కొలువైన ఉమా మహేశ్వర దేవస్థానాలకు భక్తుల తాకిడి పెరిగింది. పరమ శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాపనాశిని వద్ద పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలు వెలిగించారు. శివుడికి ప్రత్యేక పూజలు జరిపి, యాగాలు చేశారు.

నాగర్ కర్నూల్ పట్టణంలోని రామాలయం, శివాలయం, వట్టెం, పాలెం వెంకటేశ్వర ఆలయం, నంది వడ్డేమాన్ శివాలయాలు కార్తిక కాంతులతో కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details