నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మద్యం దుకాణాలను తొలగించాలని ప్రధాని మోదీకి... స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు శివకుమార్ లేఖ రాశాడు. పట్టణంలో విద్యాసంస్థలకు, గ్రంథాలయానికి మధ్యలో మద్యం దుకాణాలు ఉన్నందున... కళాశాల, పాఠశాల విద్యార్థులకు, గ్రంథాలయ పాఠకులకు ఇబ్బందువుతోందని లేఖలో పేర్కొన్నాడు.
మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ - letter to prime minister for remove the wine shop
విద్యాసంస్థలకు, గ్రంథాలయానికి మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన యువకుడు ప్రధానికి లేఖ రాశాడు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా... ఫలితం లేదని ఏకంగా దేశ ప్రధానికే విన్నవించాడు.
మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ
ఈ సమస్యను అధికారుల, ప్రజాప్రతినిధుల, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా... ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. చిన్న చిన్న సమస్యల పట్ల త్వరితగతిన స్పందిస్తూ... వార్తల్లో నిలుస్తున్న దేశ ప్రధానికి లేఖ రాసినట్లు వివరించారు. మద్యం దుకాణాలను తొలగించి, గ్రంథాలయానికి అవసరమైన సౌకర్యాలు, పుస్తకాలు సమాకూర్చాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : శబరిమల, రఫేల్ కేసులపై రేపు సుప్రీం తీర్పు
Last Updated : Nov 13, 2019, 5:41 PM IST