నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలోని కేఎల్ఐ పంపుహౌస్ ద్వారా నవంబర్ 20 నాటికి నీరు ఇస్తామని ప్రాజెక్ట్ సీఈ అంజయ్య తెలిపారు. దెబ్బతిన్న మూడో మోటార్ మరమ్మతులకు చర్యలు చేపట్టామన్నారు. ఐదో మోటార్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎత్తిపోతల సలహాదారుడు పెంటా రెడ్డితో కలిసి ఎల్లూరు పంపుహౌస్‌లో నీళ్లు తోడే ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. పంపు హౌస్‌లో ఉన్న నీటిని ఎత్తివేయగా... శుక్రవారం సాయంత్రం పూర్తిగా మోటార్లు తేలాయి.
'నవంబర్ 20 నాటికి వినియోగంలోకి ఎల్లూరు పంప్‌హౌస్' - నాగర్ కర్నూల్లోని ఎల్లూరు కేఎల్ఐ ప్రాజెక్ట్
నాగర్ కర్నూలు జిల్లా ఎల్లూరులోని కేఎల్ఐ పంపుహౌస్ మరమ్మతులకు ముమ్మర చర్యలు చేపట్టామని ప్రాజెక్ట్ సీఈ అంజయ్య తెలిపారు. నవంబర్ 20నాటికి నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. నిపుణులు వచ్చిన తర్వాతే పంపుహౌస్‌లోకి నీరు చేరడంపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.
బీహెచ్ఈఎల్ కంపెనీ ఇంజినీరింగ్ నిపుణులు వచ్చిన తర్వాతే ఎల్లూరు పంపు హౌస్‌లోకి నీళ్లు చేరడం, మోటార్లు దెబ్బతినడానికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ప్యానల్ బోర్డులు, సాంకేతిక సామగ్రి దెబ్బతినటం, తదితర వాటిని పరిశీలించిన తర్వాతనే మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. సాధ్యమైనంత త్వరగా నీళ్లు తోడే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పంపు హౌస్‌లో ఉన్న ఆయిల్ వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామన్నారు. 24 గంటల పాటు సిబ్బంది పనులు చేస్తున్నట్లు సీఈ అంజయ్య వివరించారు.