నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్ మోటార్లను వచ్చేనెల 15న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటమునిగిన పంప్‌హౌజ్ మోటార్ల వద్ద నీటి తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రేపటిలోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వచ్చేనెల 15న కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం?
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్ మోటార్లను వచ్చేనెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంప్‌హౌజ్‌లో నీటి తొలగింపు ప్రక్రియ రేపటిలోగా కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
వచ్చేనెల 15 కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం?
ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా , ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అక్కడకు చేరుకోనున్నారు. నీటిని పూర్తిగా తొలగించాక నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారం మోటార్లను సిద్ధం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్ పంప్‌హౌజ్‌పై బుధవారం సమావేశంలో చర్చించారు.