కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నా..ఆ నీటిని వినియోగించుకోలేక పోతున్నామంటూ నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల రైతులు వాపోతున్నారు. మండల కేంద్రంలో సాగునీటి కోసం జలసాధన కమిటీ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ దీక్షకు దిగారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా జిల్లాలోని పలు మండలాల్లో నీటి సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బల్మూర్, లింగాల, అమ్రాబాద్ మండలాల్లోని పొలాలు బీడుభూములుగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ మూడు మండలాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.