కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి మరో రెండు పంపులను కూడా పునరుద్ధరించేందుకు నీటిపారుదలశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు పంపుల పునరుద్ధరణ పూర్తయి... అవి నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇంకా మూడు పంపులు సిద్ధం కావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఒక పంపును పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
'పంపులను పునరుద్ధరించే పనిలో నీటిపారుదలశాఖ' - IRRIGATION DEPARTMENT NEWS
కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి మరో రెండు పంపులను కూడా పునరుద్ధరించేందుకు నీటిపారుదలశాఖ సిద్ధమవుతోంది. మరో పంపును ఈనెల 24 వరకు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
'పంపులను పునరుద్ధరించే పనిలో నీటిపారుదలశాఖ'
మరో పంపును ఈనెల 24 వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఐదో పంపు దెబ్బతిన్న నేపథ్యంలో బీహెచ్ఈఎల్ బృందం గురువారం పంప్ హౌజ్‌ను సందర్శించనుంది. అక్కడే మరమ్మత్తులు చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఇందుకు కనీసం మూణ్నెళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అక్కడ మరమ్మత్తులు చేసే అవకాశం లేకపోతే భోపాల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐదో పంపు సిద్ధమయ్యేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
ఇదీ చూడండి:కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం