నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు పాలనాధికారి మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
'సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్' - నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి వార్తలు
ప్రజల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. ఏ రంగానికి చెందిన వారికైనా తమ సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇది మంచి అవకాశం అని తెలిపారు.
'సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్'
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్లైన్ ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని మను చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ-ఆవిష్కరణలను సోషల్ మీడియా ద్వారా చూడవచ్చని తెలిపారు. ఇందులో గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు ప్రదర్శించవచ్చని తెలిపారు.