తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభం ప్రశాంతం... అలస్యమైతే మాత్రం దూరం - INTERMEDIATE EXAMS IN TELANGANA

రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షకు విద్యార్థులు గంట ముందే కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్క నిమిషం నిబంధనకు పలు చోట్ల విద్యార్థులకు అనుమతి లభించలేదు.

INTERMEDIATE EXAMS STARTED IN NAGARKARNOOL
INTERMEDIATE EXAMS STARTED IN NAGARKARNOOL

By

Published : Mar 4, 2020, 1:40 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో మొత్తం ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా... మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

ఐదు నిమిషాలు అలస్యం...

ఒక్క నిమిషం ఆలస్యమైనా... పరీక్షాకేంద్రంలోకి అనుమతించమన్న నిబంధన వల్ల కొందరు విద్యార్థులు పరుగులు తీశారు. పలు చోట్ల మాత్రం విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్​ మొదటి సంవత్సరం విద్యార్థి లింగమయ్య ఐదు నిమిషాలు ఆలస్యంగా రావటం వల్ల... ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం నిర్వాహకులు అనుమతించలేదు. చేసేదేమీలేక విద్యార్థి పరీక్ష కేంద్రం నుంచి నిరుత్సాహంగా వెనుదిరిగాడు.

ప్రశాతంగా ప్రారంభం... అలస్యమైతే మాత్రం దూరం

ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ABOUT THE AUTHOR

...view details